పల్లవి :
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటాగ నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
చరణం : 1
దోసిట్లో ఒక్కో చుక్కా పోగేసిఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా
సూర్యుణ్ణే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి
చందమామ అయిపోయాడుగా
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
చరణం : 2
ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళి
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓ సారటువై పెళుతుంది మళ్ళీ ఇటు వైపొస్తుంది
ఈరైలుకి సొంతూరేదో గురుతురాదెలా
కూ కూ బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటాగ నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
చిత్రం : మనసంతానువ్వే (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : సంజీవని, ఉష
----
పాట - 2
పల్లవి :
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
ఏ వైపు చూపినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
ఏ వైపు చూపినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
చరణం : 1
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతీ
గాలిలో పరిమళం నాకు చెబుతున్నదీ
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతీ
గాలిలో పరిమళం నాకు చెబుతున్నదీ
ఏపుడో ఒకనాటి నిన్ననీ
వెతికాననీ ఎవరు నవ్వనీ
ఇపుడూ నిను చూపగలనని
ఇదిగో నా నీడ నువ్వనీ
నేస్తమా నీకు తెలిసేదేలా...
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
ఏ వైపు చూపినా ఏమి చేసినా ఎక్కడున్నా
చరణం : 2
ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలనీ
గుండెలో ఊసులే నీకు చెప్పాలనీ
ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలనీ
గుండెలో ఊసులే నీకు చెప్పాలనీ
నీ తలపులు చినుకు చినుకుగా
దాచిన బరువెంత పెరిగినా
నిను చేరే వరకు ఎక్కడ
కరిగించును కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా...
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
ఏ వైపు చూపినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
ఏ వైపు చూపినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
చిత్రం : మనసంతానువ్వే (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : ఆర్.పి.పట్నాయక్, ఉష
----
పాట - 3
నీ స్నేహం ఇక రాను అని
కరిగే కలగా అయినా
ఈ దూరం నువు రాకు అని
నను వెలివేస్తూ ఉన్నా
మనసంతా నువ్వే... నా మనసంతా నువ్వే...
మనసంతా నువ్వే... నా మనసంతా నువ్వే...
చిత్రం : మనసంతా నువ్వే (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : ఆర్.పి.పట్నాయక్
----
పాట - 4
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థంకాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...
ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ
కలవని మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...
చిత్రం : మనసంతా నువ్వే (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : కె.కె.
No comments:
Post a Comment