Monday, May 30, 2011

Mangamma gari manavadu (1984) - 1

పాట - 1

పల్లవి :

దంచవే మేనత్త కూతురా

వడ్లు దంచవే నా గుండెలదరా

దంచవే మేనత్త కూతురా

వడ్లు దంచవే నా గుండెలదరా

దంచు దంచు బాగా దంచు

అరె దంచు దంచు బాగా దంచు

దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా

ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ

దంచవే మేనత్త కూతురా

వడ్లు దంచవే నా గుండెలదరా

చరణం : 1

పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి

ఎడమ చే త ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు

పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి

ఎడమ చే త ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు

ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి

ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి

అహహహహ...

కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే

పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే

దంచుతా మంగమ్మ మనవడా

ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ

దంచుతా మంగమ్మ మనవడా

ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ

చరణం : 2

కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు

ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు

కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు

ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు

ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి

ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి

నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే

నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను

దంచవే మేనత్త కూతురోయ్

వడ్లు దంచవే నీ గుండెలదరదరదర

దంచుతా మంగమ్మ మనవడా

ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ


చిత్రం : మంగమ్మగారి మనవడు (1984)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

No comments:

Post a Comment