పల్లవి :
ఆ... ఆ... ఓ... ఓ...
నవ్వుల నదిలో పవ్వుల పడవ కదిలే...
ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి...
నవ్వుల నదిలో పవ్వుల పడవ కదిలే...
ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి...
చరణం : 1
అనుకోని సుఖము పిలిచేను
అనురాగ మధువు ఒలికేను
అనుకోని సుఖము పిలిచేను
అనురాగ మధువు ఒలికేను
కొనగోటితో నిను తాకితే పులకించవలెను నీ మేను
అహహా...నవ్వుల నదిలో పవ్వుల పడవ కదిలే...
ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి...
చరణం : 2
నిదురించవోయి ఒడిలోన
నిను వలచెనోయి నెరజాణ
నిదురించవోయి ఒడిలోన
నిను వలచెనోయి నెరజాణ
అరచేతిలో వైకుంఠము దొరికేను నీకు నిముషాన...
అహహా... నవ్వుల నదిలో పవ్వుల పడవ కదిలే...
ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి...
ఆహాహ... ఆహాహా... ఒహొ... ఒహోహొ... ఓహోహో...
ఆహాహ... ఆహాహా... ఒహొ... ఒహోహొ... ఓహోహో...
చిత్రం : మర్మయోగి (1964)
రచన : ఆరుద్ర
సంగీతం : ఘంటసాల
గానం : పి.లీల, ఘంటసాల (ఆలాపన)
No comments:
Post a Comment