Tuesday, May 31, 2011

Matrudevobhava (1993) - 2

పాట - 1

పల్లవి :

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

మాతృదేవోభవ... పితృదేవోభవ... ఆచార్యదేవోభవ...

చరణం : 1

ఏడుకొండలకైనా బండతానొక్కటే

ఏడు జన్మల తీపి ఈ బంధమే

ఏడుకొండలకైనా బండతానొక్కటే

ఏడు జన్మల తీపి ఈ బంధమే

నీ కంటిలో నలక లో వెలుగు

నే కనక నేను నేననుకుంటే ఎద చీకటే

హరీ... హరీ... హరీ...

రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏనాటికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

చరణం : 2

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే

నిప్పు నిప్పుగమారె నాగుండెలో... ఆ...

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే

నిప్పు నిప్పుగమారె నాగుండెలో...

ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు

పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు

హరీ... హరీ... హరీ...

రెప్పనై ఉన్నాను మీ కంటికి

పాపనై వస్తాను మీ ఇంటికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి

గాలినై పోయాను గగనానికి...


చిత్రం : మాతృదేవోభవ (1993)

రచన : వేటూరి

సంగీతం : ఎంఎం.కీరవాణి

గానం : చిత్ర

----

పాట - 2

పల్లవి:

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటమాలి నీ తోడు లేడులే

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడోచీకటాయెలే

నీకిది తెలవారని రేయమ్మా

కలికీ మా చిలక పాడకు నిన్నటి నీ రాగం

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటమాలి నీ తోడు లేడులే

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడో చీకటాయెలే

చరణం : 1

చెదిరింది నీ గూడు గాలిగా చిలకగోరింకమ్మ గాధగా

చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా ఆ....

తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగ

సిందూరవర్ణాలు తెల్లారి చల్లారి పోగా

తిరిగే భూమాత వు నీవై వేకువలో వెన్నెలవై

కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటమాలి నీ తోడు లేడులే

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

చరణం : 2

అనుబంధమంటెనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే

హేమంతరాగాల చేవుంతులే వాడిపోయే ఆ..

తనరంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే

దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పోయే

పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలవై

మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటవూలి నీ తోడు లేడులే

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడో చీకటాయెలే


చిత్రం : మాతృదేవోభవ (1993)

రచన : వేటూరి

సంగీతం, గానం : ఎం.ఎం.కీరవాణి

No comments:

Post a Comment