Tuesday, May 31, 2011

Master (1997) - 2

పాట - 1
పల్లవి :
తమ్ముడు అరె తమ్ముడు

ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే

నను అడగర చెబుతా డౌటుంటే

నువు బెదరవు కదా నా మాటింటే

అమ్మడు ఓయ్ అమ్మడు నువు మరీ పరాగ్గా ఉంటుంటే

నీకు నిదరే సరిగా రాకుంటే

ఏం జరిగిందో తెలియాలంటే

ఆ రహస్యాన్ని చెబుతా వింటే

మాస్టారూ మాస్టారూ మంచి లెక్చర్ ఇచ్చారు

మాస్టారూ మాస్టారూ లవ్‌లో మీరు మెగాస్టారు

థాంక్యూ... తమ్ముడు అరె తమ్ముడు

ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే

చరణం : 1

వేల వేల భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్లామరొక్కటే లవరు

ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరూ

మూగసైగలైన చాలు వేడి ఊపిరైన చాలు గుర్తుపట్టలేరా ప్రేమికులు

అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు

అమెరికాలో ఇంగ్లిష్ ప్రేమ

ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ

ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ

తమ్ముడు అరె తమ్ముడు

పొట్టివాళ్లు పొట్టవాళ్లు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు

ప్రేమదేశం వెళ్లగానే మానవులుగా మిగులుతారు

తమ్ముడు అరె తమ్ముడు

ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే

నను అడగర చెబుతా డౌటుంటే

నువు బెదరవు కదా నా మాటింటే

చరణం : 2

లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు

అది మహాసముద్రం ఫ్రెండు

సెంచరీల కొద్ది పెద్ద సీరియల్‌గా సాగుతున్న మహా నవలరా ప్యారు

ఆ స్టోరీ కొట్టదు బోరు

కగుడింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు

కాఫీ టీలే తాగని వాళ్లు దేవదాసులు అయిపోతారు

అమ్మడు ఓయ్ అమ్మడు లబ్బుడబ్బు హార్ట్‌బీట్ లవ్వులవ్వు అన్నదంటే

హైక్లాసు లోక్లాసు చూసుకోదు ప్రేమ కేసు

తమ్ముడు అరె తమ్ముడు

ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే

నను అడగర చెబుతా డౌటుంటే

నువు బెదరవు కదా నా మాటింటే

అమ్మడు ఓయ్ అమ్మడు నువు మరీ పరాగ్గా ఉంటుంటే

నీకు నిదరే సరిగా రాకుంటే

ఏం జరిగిందో తెలియాలంటే

ఆ రహస్యాన్ని చెబుతా వింటే

మాస్టారూ మాస్టారూ మంచి లెక్చర్ ఇచ్చారు

మాస్టారూ మాస్టారూ లవ్‌లో మీరు మెగాస్టారు


చిత్రం : మాస్టర్ (1997)

రచన : సిరివెన్నెల

సంగీతం : దేవా

గానం : చిరంజీవి, బృందం

----

పాట - 2


పల్లవి :

తిలోత్తమా ప్రియ వయ్యారమా

ప్రభాతమా శుభ వసంతమా

నే మోయలేనంటూ హృదయాన్ని అందించా

నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా

ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది

ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది

ఆ... తిలోత్తమా ప్రియ వయ్యారమా...

చరణం : 1

పెదవే ఓ మధుర కవిత చదివే

అడుగే నా గడపనొదిలి కదిలే

ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణీ ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా

ఈ మాయ చేసింది ప్రేమే

ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే

తిలోత్తమాసుఖ వసంతమా

చరణం : 2

కలలే నా ఎదుట నిలిచె నిజమై

వలపే నా ఒడికి దొరికె వరమై

ఏ రాహువైనా ఆషాఢమైనా ఈ బహుబంధాన్ని విడదీయునా

నీ మాటలే వేదమంత్రం

చెలి నువ్వన్నదే నా ప్రపంచం

తిలోత్తమా ప్రియ వయ్యారమా

ప్రభాతమా శుభ వసంతమా

నే మోయలేనంటూ హృదయాన్ని అందించా

నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా

ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది

ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది


చిత్రం : మాస్టర్ (1997)

రచన : చంద్రబోస్

సంగీతం : దేవా

గానం : హరిహరన్, సుజాత


No comments:

Post a Comment