Monday, May 30, 2011

Maryada ramanna (2010) - 2

పాట - 1

పల్లవి :

రాయలసీమ మురిసిపడేలా...

రాగలవాడి జన్మ తరించేలా...

ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది

మూడు ముళ్ళు వేయమంది

తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...

కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి

తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...

అందుకోమన్నది నిన్ను తన చేయి

చరణం : 1

పలికే పలుకుల్ల్లో ఒలికే తొలకరి

ఇంట్లో కురిసిందో సిరులే మరి

నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి

జంటై కలిసిందో కలతే హరి

హంసల నడకల వయారి అయినా ఏడడుగులు నీ వెనకే

ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన జాబిలి తునకే

తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...

కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి

తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...

అందుకోమన్నది నిన్ను తన చేయి

చరణం : 2

గీతలే అని చిన్న చూపెందుకు

వాటి లోతులు చూడలేరెందుకు

నదిలో పడవలా వానలో గొడుగులా

గువ్వపై గూడులా కంటిపై రెప్పలా

జతపడే జన్మకి తోడు ఉంటానని

మనసులో మాటనే మనకు చెప్పకనే చెబుతుంది

తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...

గుండెనే కుంచెగా మలచిందోయి

తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...

కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి

తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...

అందుకోమన్నది నిన్ను తన చేయి


చిత్రం : మర్యాదరామన్న (2010)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : ఎం.ఎం.కీరవాణి, గీతామాధురి

----

పాట - 2

పల్లవి :

రాయె రాయె రాయె రాయె రాయె సలోని

జాము రాత్తిరేళ సందు చూసి జంపు జిలాని

రాయె రాయె రాయె రాయె రాయె సలోని

జాము రాత్తిరేళ సందు చూసి జంపు జిలాని

తెల్లవారి నాక చూసి పిల్లలేదని

ఘొల్లుమంటు ఊరువాడ ఉడికి ఉడికి చావనీ రాయె రాయె...

రాయె రాయె రాయె రాయె రాయె సలోని

జాము రాత్తిరేళ సందు చూసి జంపు జిలాని

చరణం : 1

గూటిలోన గుట్టుగా మందిలోనె మట్టుగా

చేద్దామ గూడుపురాణీ

పగటిపూట దొంగలా మాపటేళ కింగులా

గొగ్గోడ దూకి నేను నిన్ను చేరి గోకుతుంటె

నాచ్ నాచ్ నాచ్ మేరే

సాత్ సాత్ సాత్ గిల్లీ

గిచ్చుకుంటా నాకు నచ్చావే

షేక్ షేక్ షేక్ తేరీ

సోక్ సోక్ సోక్ పిల్లా

ముట్టుకుంటే ముద్దు వచ్చావే రాయె రాయే...

రాయె రాయె రమ్మనంటె రాదు సలోని

చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంపు జిలాని

రాయె రాయె రాయె రాయె రాయె సలోని

జాము రాత్తిరేళ సందు చూసి జంపు జిలాని

అడుగు వేస్తే గుండెలోన అదురుతున్నదీ

అదురుతుంటే కుదురులేక కాలు కదుపుతున్నదీ రాయె రాయే...

చరణం : 2

రమణ రమణ వెంకటా పిల్ల ముదురు టెంకట

వీధెక్కి వింత గలాటా

ఎవడు చూస్తే ఏంటటా ఎగరనియ్యి బావుటా

జిలాని జంపుతో జనాల తిక్క కుదురుతుంటే

నాచ్ నాచ్ నాచ్ మేరే

సాత్ సాత్ సాత్ గిల్లీ

గిచ్చుకుంటా నాకు నచ్చావే

షేక్ షేక్ షేక్ ఇల్లా

సోక్ సోక్ సోక్ నల్లా

ముట్టుకుంటే ముద్దు వచ్చావే రాయె రాయే...

రాయె రాయె రాయె రాయె రాయె సలోని

జాము రాత్తిరేళ సందు చూసి జంపు జిలాని

రాయె రాయె రమ్మనంటె రాదు సలోని

చిన్న మాయ చేసి మంత్రమేస్తే జంపు జిలాని


చిత్రం : మర్యాదరామన్న (2010)

రచన : చైతన్యప్రసాద్

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : రఘు కుంచె, గీతామాధురి

No comments:

Post a Comment