Monday, May 30, 2011

Manushulu marali (1969) - 2

పాట - 1

పల్లవి :

తూరుపు సిందూరపు మందారపు వన్నెలలోAdd Image

ఉదయరాగం హృదయగానం

ఉదయరాగం హృదయగానం

తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో

ఉదయరాగం హృదయగానం

ఉదయరాగం హృదయగానం

మరల మరల ప్రతిఏడూ మధుర మధుర గీతం

జన్మదిన వినోదం

మరల మరల ప్రతిఏడూ మధుర మధుర గీతం

జన్మదిన వినోదం

తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో

ఉదయరాగం హృదయగానం

ఉదయరాగం హృదయగానం

చరణం : 1

వేనవేల వత్సరాల కేళిలో

మానవుడుదయించిన శుభవేళలో

వేనవేల వత్సరాల కేళిలో

మానవుడు దయించిన శుభవేళలో

వీచె మలయమారుతాలు

పుడమి పలికె స్వాగతాలు

మాలికలై తారకలే

మలిచె కాంతి తోరణాలు...

ఓహో... హోయ్...

తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో

ఉదయరాగం హృదయగానం

ఉదయరాగం హృదయగానం

చరణం : 2

వలపులోన పులకరించు కన్నులతో

చెలిని చేరి పలుకరించు మగవారు

మనసులోన పరిమళించు వెన్నెలతో

ప్రియుని చూచి పరవశించు ప్రియురాలు

జీవితమే స్నేహమయం

ఈ జగమే ప్రేమమయం

ప్రేమంటే ఒక భోగం

కాద కాదు అది త్యాగం...

ఓ... హోయ్...

తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో

ఉదయరాగం హృదయగానం

ఉదయరాగం హృదయగానం

చిత్రం : మనుషులు మారాలి (1969)

రచన : శ్రీశ్రీ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

చీకటిలో కారు చీకటిలో

కాలమనే కడలిలో శోకమనే పడవలో

ఏ దరికో... ఏ దెసకో...

చీకటిలో కారు చీకటిలో

కాలమనే కడలిలో శోకమనే పడవలో

ఏ దరికో... ఏ దెసకో...

చరణం : 1

మనసున పెంచిన మమతలు పోయె

మమతలు పంచిన మనిషే పోయె

మనసున పెంచిన మమతలు పోయె

మమతలు పంచిన మనిషే పోయె

మనిషే లేని మౌనంలోన

మనుగడ చీకటి మయమైపోయె

లేరెవరూ... నీకెవరూ...

చీకటిలో కారు చీకటిలో

కాలమనే కడలిలో శోకమనే పడవలో

ఏ దరికో... ఏ దెసకో...

చరణం : 2

జాలరి వలలో చేపవు నీవే

గానుగ మరలో చెరకువు నీవే

జాలరి వలలో చేపవు నీవే

గానుగ మరలో చెరకువు నీవే

జాలే లేని లోకంలోన

దారే లేని మనిషివి నీవే

లేరెవరూ... నీకెవరూ...

చీకటిలో కారు చీకటిలో

కాలమనే కడలిలో శోకమనే పడవలో

ఏ దరికో... ఏ దెసకో...


చిత్రం : మనుషులు మారాలి (1969)

రచన : శ్రీశ్రీ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఘంటసాల

No comments:

Post a Comment