Friday, May 27, 2011

Manchi chedu (1963) - 1

పాట - 1

రామ్మూర్తి-ఎం.ఎస్.విశ్వనాథన్

పల్లవి :

రేపంటి రూపం కంటీ పూవింటి చూపుల వంటీ

నీ కంటి చూపుల వెంటే నా పరుగంటీ

రేపంటి వెలుగే కంటీ పూవింటి దొరనే కంటీ

నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ

చరణం : 1

నాతోడు నీైవె యుంటే నీ నీడ నేనేనంటీ...

ఈ జంట కంటే వేరులేదు లేదంటీ

నాతోడు నీైవె యుంటే నీ నీడ నేనేనంటీ...

ఈ జంట కంటే వేరులేదు లేదంటీ

నీ మీద ఆశలు ఉంచీ ఆపైన కోటలు పెంచీ

నీ మీద ఆశలు ఉంచీ ఆపైన కోటలు పెంచీ

నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటీ

రేపంటి రూపం కంటీ పూవింటి చూపుల వంటీ

నీ కంటి చూపుల వెంటే నా పరుగంటీ

చరణం : 2

నే మల్లెపువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసీ

నీ చల్లని నవ్వుల కలసివుంటే చాలంటీ

నే మల్లెపువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసీ

నీ చల్లని నవ్వుల కలసివుంటే చాలంటీ

నీ కాలి మువ్వల రవ ళీ నా భావి మోహన మురళీ

నీ కాలి మువ్వల రవ ళీ నా భావి మోహన మురళీ

ఈ రాగసరళి త రలిపోదాం రమ్మంటీ

రేపంటి వెలుగే కంటీ పూవింటి దొరనే కంటీ

నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ

చరణం : 3

నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటీ

వేయించి నేనే వోడిపోనీ పొమ్మంటీ

నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచీ

రాగాలు రంజిలురోజే రాజీ రమ్మంటీ

రేపంటి వెలుగే కంటీ పూవింటి దొరనే కంటీ

నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటీ

రేపంటి రూపం కంటీ పూవింటి చూపుల వంటీ

నీ కంటి చూపుల వెంటే నా పరుగంటీ


చిత్రం : మంచి-చెడు (1963)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్-రామ్మూర్తి

గానం : ఘంటసాల, పి.సుశీల

No comments:

Post a Comment