Friday, May 27, 2011

Manase mandiram (1966) - 1

పాట - 1

పల్లవి :

తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

ముగిసిన గాథ మొదలిడదుదేవుని రచనలలో

మొదలిడు గాథ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో

తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

చరణం : 1

మనసునకెన్నో మార్గాలు

కనులకు ఎన్నో స్వప్నాలు

ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు

మనసునకెన్నో మార్గాలు

కనులకు ఎన్నో స్వప్నాలు

ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు

ఎదలో ఒకరే కుదిరిననాడు మనసే ఒక స్వర్గం

ఒకరుండగా వేరొకరొచ్చారా లోకం ఒక నరకం

తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు

చరణం : 2

ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం

ఎది నిజమౌ బంధం

ఎది అనురాగం ఎది ఆనందం

బ్రతుకునకేదీ గమ్యం

మంచి చెడు మారేదే మనదన్నది మాటేదే

ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం

తలచినదే జరిగినదా దైవం ఎందులకు

జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు


చిత్రం : మనసే మందిరం (1966)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం : పి.బి.శ్రీనివాస్

No comments:

Post a Comment