Monday, May 30, 2011

Manchi manishi (1964) - 2

పాట - 1

పల్లవి :

అంతగా నను చూడకు... ష్... మాటాడకు

అంతగా నను చూడకు...

వింతగా గురి చూడకు వేటాడకు

హొయ్ అంతగా నను చూడకు

చరణం : 1

చలిచలి గాలులు వీచెను.. సన్నని మంటలు లేచెను

చలిచలి గాలులు వీచెను.. సన్నని మంటలు లేచెను

తలపులే కవ్వించెను... వలపుల వీణలు తేలించెను

హొయ్... అంతగా నను చూడకు... ష్... మాటాడకు

అంతగా నను చూడకు...

వింతగా గురి చూడకు వేటాడకు

హొయ్ అంతగా నను చూడకు

చరణం : 2

జిలిబిలి ఊహలురేగెను... నా చేతులు నీకై సాగెను

జిలిబిలి ఊహలు రేగెను... నా చేతులు నీకై సాగెను

పెదవులే కవ్వించెను... పదునౌ చూపులు బాధించెను

హొయ్... అంతగా నను చూడకు... ష్... మాటాడకు

అంతగా నను చూడకు...

వింతగా గురి చూడకు వేటాడకు

హొయ్ అంతగా నను చూడకు

చరణం : 3

వాలుగ నిన్నే చూడనీ... కలకాలము నీలో దాగనీ

వాలుగ నిన్నే చూడనీ... కలకాలము నీలో దాగనీ

నవ్వులే పండించ ని... పువ్వుల సంకెల బిగించని

హొయ్... అంతగా నను చూడకు... ష్... మాటాడకు

అంతగా నను చూడకు...

వింతగా గురి చూడకు వేటాడకు

హొయ్ అంతగా నను చూడకు


చిత్రం : మంచిమనిషి (1964)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : ఎస్.రాజేశ్వరరావు-టి.చలపతిరావు

గానం : ఘంటసాల, పి.సుశీల

----

పాట - 2

సాకీ :

ఓ ఓ ఓ... గులాబి... ఓ ఓ ఓ... గులాబి

వలపు తోటలో విరిసిన దానా

లేత నవ్వుల... వెన్నెల సోన

పల్లవి :

ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల

సొగసైన కనులదానా సొంపైన మనసుదానా

నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో

ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల

చరణం : 1

కొంటె తుమ్మెదల వలచేవు... జుంటి తేనెలందించేవు

కొంటె తుమ్మెదల వలచేవు... జుంటి తేనెలందించేవు

మోసం చేసి మీసం దువ్వి

మోసకారులకు లొంగేవు లొంగేవు

ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల

చరణం : 2

రూపం చూసి వస్తారు... చూపుల గాలం వేస్తారు

రూపం చూసి వస్తారు... చూపుల గాలం వేస్తారు

రేకుల చిదిమీ సొగసులు నులిమీ

చివరకు ద్రోహం చేస్తారు

చివరకు... ద్రోహం... చేస్తారు...

ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల

సొగసైన కనులదానా సొంపైన మనసుదానా

నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో

తెలుసుకో తెలుసుకో...


చిత్రం : మంచిమనిషి (1964)

రచన : దాశరథి

సంగీతం : టి.చలపతిరావు

గానం : పి.బి.శ్రీనివాస్

No comments:

Post a Comment