Wednesday, May 25, 2011

Magadheera (2009) - 3

పాట - 1

పల్లవి :

పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా

మంచు పూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా

చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా

నువ్వు అందకపోతే వృథా ఈ జన్మా

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా

నువ్వు అందకపోతే వృథా ఈ జన్మా

చరణం : 1

పువ్వుపైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే

పసిడి పువ్వు నువ్వని పంపిందే

నువ్వు రాకు నా వెంటాయే పువ్వు చుట్టూ ముల్లంటాయ్

అంటుకుంటే మంటే ఒళ్ళంతా

తీగపైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే

మెరుపుతీగ నువ్వని పంపిందే

మెరుపు వెంట ఉరుమంటా ఉరుము వెంట వరదంటానే

వరదలాగ మారితే ముప్పంటా

వరదైనా వరమని బరిస్తానమ్మా

మునకైనా సుఖమని ముడేస్తానమ్మా

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా

నువ్వు అందకపోతే వృథా ఈ జన్మా

చరణం : 2

గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా

గాలి ఊపిరయ్యింది నేల నన్ను నడిపింది ఏవిటంటా నీలోని గొప్పా

వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది పక్షపాతమెందుకు నాపైనా

వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పోలిక నీకేలా

అవి బతికిన్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా

నువ్వు అందకపోతే వృథా ఈ జన్మా


చిత్రం : మగధీర (2009)

రచన : చంద్రబోస్

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : అనూజ్ గురువారా, రీటా

----

పాట - 2

అనగనగనగనగనగా అనగనగనగనగా అనగనగనగనగనగా...

అనగనగనగనగనగా అనగనగనగనగాఅనగనగనగనగనగా

అనగనగనగనగనగా అనగనగనగనగా అనగనగనగనగనగా

హే... అనగనగనగనగనగనగనగా...

రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలో

ఒకటే ఎందుకు ఎండాలేదురా

అది ఒకటే ఎందుకు ఎండాలేదురా

అది ఎండేలోగా వానొచ్చిందిరా

పాయింటే...

ఆ వానల్లోనా వరదొచ్చిందిరా

చేప... ఎండేలోగా వానొచ్చిందిరా

ఆ వానాల్లోనా వరదొచ్చిందిరా

ధీర... ధీర... ధీర...

మగువులు వలచిన మగధీరా...

మనసులు దోచిన మగధీరా...

జనమెగబడి మెచ్చిన మగధీరా...

జగమెరిగిన మగ మగధీరా...

ధీర... ధీర... ధీర... ధీర...

Get on the feet

No move less on the street

Every one do something

Better do the sodha thing

Now rock every one

We on the run

Now heat the floor

Move move every one

Get the growl

Now dance every one

Now rock the show

Now catch every one

yeah... ha ha ha...

ఏ... చలపతిగాడి దూళ్ల పాక పక్కన ఉన్న సందు వెనుక

విరగపండిన తోటలోన నిగనిగమంటున్న నిమ్మపండు పండు పండు...

అది మీసం మీద నిలబెట్టాలిరా

నిమ్మపండు మీసం మీద నిలబెట్టాలిరా

కొండలు పిండి కొట్టెయ్యాలిరా దిక్కులనైనా దున్నెయ్యాలిరా

అహా...కొండలు పిండి కొట్టెయ్యాలిరా దిక్కులనైనా దున్నెయ్యాలిరా

ధీర... ధీర... ధీర...

Wanna singana dancena magadheera

Wanna rockna movena magadheera

Wanna singana dancena magadheera

Wanna rockna movena magadheera

హే... ఇరుగు దిష్టి పొరుగు దిష్టి

ఇంటా బయటా తగిలిన దిష్టి

నీ నీ దిష్టి నా నా దిష్టి దిష్టి దిష్టి...

దెబ్బకు వదిలి దొబ్బెయ్యాలిరా

ఈ దెబ్బకు వదిలి దొబ్బెయ్యాలిరా

గుమ్మడికాయ కొట్టెయ్యాలిరా మంగళహారతి పట్టెయ్యాలిరా

గుమ్మడికాయ కొట్టెయ్యాలిరా మంగళహారతి పట్టెయ్యాలిరా

ధీర... ధీర... ధీర...

Wanna singana dancena magadheera

Wanna rockna movena magadheera

Wanna singana dancena magadheera

Wanna rockna movena magadheera

Wanna singana dancena magadheera

Wanna rockna movena magadheera

Wanna singana dancena magadheera

Wanna rockna movena magadheera


చిత్రం : మగధీర (2009)

రచన, సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : జెస్సీ గిఫ్ట్, బృందం

----

పాట - 3

పల్లవి :

ధీర ధీర ధీర మనసాగ లేదురా

చేర రార శూర సొగసందుకో దొరా

అసమాన సాహసాలు చూడ-రాదు నిద్దురా

నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర

ధీర ధీర ధీర మనసాగ లేదురా

చేర రార శూర సొగసందుకో దొరా

చరణం : 1

సమరములో దూకగా చాకచక్యం నీదేరా

సరసములో కొద్దిగా చూపరా

అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా

అధిపతినై అది కాస్తా దోచేదా

పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా

చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా

ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్రపుత్ర

ధీర ధీర ధీర మనసాగ లేదురా

చేర రార శూర సొగసందుకో దొరా

చరణం : 2

శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా

కుసుమముతో ఖడ్గమే ఆడగా

మగసిరితో అందమే అంటుకడితే అంతేగా

అణువణువూ స్వర్గమే అయిపోదా

శాసనాలు ఆపజాలని తాపముందిగా

చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా

శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి

నింగిలోని తార నను చేరుకుందిరా

గుండెలో నగారా ఇక మోగుతోందిరా

నవ సోయగాలు చూడ చూడ-రాదు నిద్దురా

ప్రియపూజలేవో చేసుకోనా చేతులార సేదతీర

ధీర ధీర ధీర... ధీర ధీర ధీర...


చిత్రం : మగధీర (2009)

రచన : చంద్రబోస్

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : కీరవాణి, నికితానిగమ్


No comments:

Post a Comment