Wednesday, May 25, 2011

Malliswari (1951) - 2

పాట - 1

పల్లవి :

ఆ.... ఆ.... ఆ....

నసున వుల్లెల మాలలూగెనే

కన్నుల వెన్నెల డోలలూగెనే

ఎంత హాయి ఈ రేయి నిండెనో

ఎంత హాయి ఈ రేయి నిండెనో

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో

చరణం :

కొమ్మల గువ్వలు గుస గుస మనినా

రెమ్మల గాలులు ఉసురుసురనినా ఆ...

అలలు కొలనులో గల గల మనినా

అలలు కొలనులో గల గల మనినా

దవ్వుల వేణువు సవ్వడి వినినా

దవ్వుల వేణువు సవ్వడి వినినా

నీవు వచ్చేవ ని నీ పిలుపే విని

నీవు వచ్చేవ ని నీ పిలుపే విని

కన్నుల నీరిడి కలయ చూచితిని

గడియ యేని ఇక విడిచిపోకుమా

గడియ యేని ఇక విడిచిపోకుమా...

ఎగసిన హృదయము పగులనీకుమా

ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో

ఎంత హాయి ఈ రేయి నిండెనో


చిత్రం : మల్లీశ్వరి (1951)

రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : భానుమతి

----

పాట - 2

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు

దేశదేశాలన్ని తిరిగిచూసేవు

ఏడ తానున్నాడో బావా...

ఏడ తానున్నాడో బావా...

జాడ తెలిసిన పోయిరావా

ఆ... అందాల ఓ మేఘమాల

ఆ... చందాల ఓ మేఘమాల

గగన సీమల తేలు ఓ మేఘమాల

మావూరు గుడిపైన వస్తున్నావా

ల్లి మాటేదైన నాతో

నసు చల్లగా చిప్పిపోవా

ఆ... నీలాల ఓ మేఘమాల

ఆ... రాగాల ఓ మేఘమాల

మమతలెరిగిన మేఘమాల

నా మనసు బావకు చెప్పిరావా

ఎన్నాళ్ళు నా కళ్లు దిగులుతో రేపవలు

ఎన్నాళ్ళు నా కళ్లు దిగులుతో రేపవలు

ఎదురు తెన్నులు చూచెనే

బావకై చెదరి కాయలు కాచేనే

నీలాల ఓ మేఘమాల

రాగాల ఓ మేఘమాల

మనసు తెలిసిన మేఘమాల

రువలేనని చెప్పలేవా

ల్లితో మరువలేని చెప్పలేవా

కళ్లు తెరిచినగాని

కళ్ళు మూసిన గాని... కళ్ళు మూసిన గాని

మల్లి రూపె నిలిచేనే

నా చెంత మల్లి మాటే పిలిచేనే

జాలి గుండెల మేఘమాల

బావ లేనిది బ్రతుకుజాలా

జాలి గుండెల మేఘమాల

బావ లేనిది బ్రతుకుజాలా

కురియు నా కన్నీరు

గుండెలో దాచుకుని

వానజల్లుగ కురిసిపోవా

కన్నీరు ఆనవాలుగ బావ మ్రోల


చిత్రం : మల్లీశ్వరి (1951)

రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : భానుమతి, ఘంటసాల

No comments:

Post a Comment