Monday, May 30, 2011

Manchivadu (1974)

పాట - 1

పల్లవి :

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా

ముందు వెనుక ఏముందో ఎక్కడుందో

ఎవరికెవరికెంతుందో చూసి చెబుతా

ముందు వెనుక ఏముందో ఎక్కడుందో

ఎవరికెవరికెంతుందో చూసి చెబుతా

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా

చరణం : 1

కోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు

వజ్రాలుగా బంగారుగా మార్చి దాచకు

కోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు

వజ్రాలుగా బంగారుగా మార్చి దాచకు

రాశిలగ్నమందు నేడు రాహువున్నాడే

రాశిలగ్నమందు నేడు రాహువున్నాడే

రాత్రి రాత్రి కొచ్చి మొత్తం మింగిపోతాడు

ఏయన్నార్, ఎన్‌టీఆర్ ఏలుతారన్నాను

వాణిశ్రీ, సావిత్రికి వారసని చె ప్పాను

జగ్గయ్య, జయలలిత, శోభన్‌బాబు, కృష్ణకి

పద్మనాభం, రమాప్రభ, రాజబాబుకి

దసరాబుల్లోడికి, ప్రేమనగర్ నాయుడికి

ఆత్రేయ, ఆదుర్తి, మహాదేవనందరికీ

ఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతోంది

ఈనాడు చెప్పేది రేపు జరగబోతోంది

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా

చరణం : 2

వేలు వేలు ఎకరాలకు గోలుమాలు

తాతల ఎస్టేటుకైన చెప్పాలి టాటాలు

వేలు వేలు ఎకరాలకు గోలుమాలు

తాతల ఎస్టేటుకైన చెప్పాలి టాటాలు

దిగమింగే నాయకులకు దినగండాలు

దిగమింగే నాయకులకు దినగండాలు

పన్నెగ వేసే పెద్దలకు వెలక్కాయలు

తాతయ్య పేరుతో మనవళ్లు పెరిగారు

మనవళ్లు దోచింది మునిమనవలడిగారు

అడుగునున్న వాళ్లింక అణిగిమణిగి ఉండరు

ఆడోళ్లే ఇక మీదట అందలాన ఉంటారు

మగవాళ్ల ఆట కట్టి మరమ్మత్తు చేస్తారు

అందుకే చిట్టి నిర్మల చేతిలో శేటురాత రాశాడు

ఓ పండిట్ జీ మేరా హాత్ మేదే ఖియేనా దేఖుతా దేఖుతా

ఈనాడు చెప్పేది రేపు జరగబోతోంది

ఏమోలే అనుకుంటే మీ ఖర్మలే పోండి

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా

ముందు వెనుక ఏముందో ఎక్కడుందో

ఎవరికెవరికెంతుందో చూసి చెబుతా

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా

చిత్రం : మంచివాడు (1974)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఎం. రామారావు

No comments:

Post a Comment