Wednesday, May 25, 2011

Madana kamaraju katha (1962) - 1

పాట - 1

పల్లవి :

నీలి మేఘ మాలవోనీలాల తారవో

నీ సోయగాలతో మదిని దోచిపోదువో

నీలి మేఘ మాలవో నీలాల తారవో

నీ సోయగాలతో మదిని దోచిపోదువో

చరణం : 1

నీ మోములోన జాబిలి దోబూచులాడెనే

నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే

నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో

నీలి మేఘ మాలవో...

చరణం : 2

నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే

నీ వలపు తనివి తీరని మధురాల రావమే

నిలచేవదేల నా పిలుపు ఆలకించవో

నీలి మేఘ మాలవో...

చరణం : 3

రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే

రాగాల తేలిపోదమె జాగేల చాలునే

రావోయుగాల ప్రేయసి నన్నాదరించవో

నీలి మేఘ మాలవో నీలాల తారవో

నీ సోయగాలతో మదిని దోచిపోదువో


చిత్రం : మదన కామరాజు కథ (1962)

రచన : జి.కృష్ణమూర్తి

సంగీతం : రాజన్-నాగేంద్ర

గానం : పి.బి.శ్రీనివాస్

No comments:

Post a Comment