Wednesday, May 25, 2011

Mallepuvvu (1978) - 1

పాట - 1

పల్లవి :

చిన్నమాట ఒక చిన్నమాట...

చిన్నమాట ఒక చిన్నమాట

చిన్నమాట ఒక చిన్నమాట

కన్నె గాలి వీచె సన్నజాజి పూచె

జలదరించే చల్లని వేళ

చిన్నమాట ఒక చిన్నమాట

ఆ... చిన్నమాట ఒక చిన్నమాట

చరణం : 1

రాక రాక నీవు రాగా వలపు ఏరువాక

నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటిదాకా

నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా

వచ్చి మళ్లీ వచ్చి మనసిస్తే చాలు మాట... మాట...

చిన్నమాట ఒక చిన్నమాట

ఆ... చిన్నమాట ఒక చిన్నమాట

చరణం : 2

కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె

నీ వాలు చూపే నీలోని మెరుపై విరితేనెలే వెల్లువాయే

అందమంతా ఆరబోసి మల్లెపూల పానుపేసి

వస్తే తోడువస్తే నీడనిస్తే చాలు మాట... మాట...

చిన్నమాట ఒక చిన్నమాట

ఆ... చిన్నమాట ఒక చిన్నమాట

కన్నె గాలి వీచె సన్నజాజి పూచె (2)

జలదరించే చల్లని వేళ

చిన్నమాట ఒక చిన్నమాట


చిత్రం : మల్లెపూవు (1978)

రచన : వేటూరి

సంగీతం : చక్రవర్తి

గానం : పి.సుశీల

No comments:

Post a Comment