Wednesday, April 6, 2011

Kshana kshanam (1991) - 2

పాట - 1
పల్లవి :

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కలా

వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన

స్వరాల ఊయలూగువేళ

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

చరణం : 1

కుహు కుహు సరాగాలే శృతులుగా

కుశలమా అనే స్నేహం పిలువగా

కిలకిల సమీపించే సడులతో

ప్రతి పొద పదాలేవొ పలుకగా

కులుకురాక బుట్టబొమ్మ గుబులుగుందని

వనములేచి వద్ద కొచ్చి నిద్రపుచ్చని

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

చరణం : 2

మనసులో భయాలన్ని మరిచిపో

మగతలో మరో లోకం తెరుచుకో

కలలతో ఉషాతీరం వెతుకుతూ

నిదరతో నిషారాన్నే నడిచిపో

చిటికలోన చిక్కబట్టి కటిక చీకటి

కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కలా

వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన

స్వరాల ఊయలూగు వేళ...


చిత్రం : క్షణ క్షణం (1991)

రచన : సిరివెన్నెల

సంగీతం : ఎం.ఎం. కీరవాణి

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

----

పాట - 2

పల్లవి :

కింగులా కన్పిస్తున్నాడు మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు

ఏమా సరదా గమ్మత్తుగా లేదా ఏమా సరదా

రాజైనా రారాజైనా మనీ ఉన్న మన ముందు సలామ్ కొట్టవలసిందే

ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే

పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా

కో అంటే... కోటి! దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి

తందర్‌తర్‌దా తందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దా

తందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దా

చరణం : 1

ఓయబ్బో మయసభలా యమాగా ఉంది ఏమి మాయలోకమిది

అచ్చ తెలుగులో ఐదు తారల పూటకూళ్ళ ఇల్లు

మేకప్ వేసి మరో భాషలో ఫైవ్‌స్టార్ హోటల్ అంటారు

ఎస్ యూ హేవ్ ఎనీ రిజర్వేషన్

అయ్యయ్యో లేదే...

వెల్‌కమ్ సార్... వెల్‌కమ్ లేడీ...

వుయ్ ఆర్ గ్లాడ్ టూ హేవ్ యూ హియర్

టూ సర్వ్ యూ ఈజ్ అవర్ ప్లెజర్

రెపరెపలాడే రంగు కాగితం ఏవిఁటదీ

దేవుళ్లైనా దేవుల్లాడే అంత మహాత్మ్యం ఏముందీ

శ్రీ లక్ష్మీదేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం

ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది లోకం మొత్తం

చెక్ అంటారు దీన్ని... చెక్ ఇన్ సార్

కో అంటే... కోటి! దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి

చరణం : 2

వావ్... అయ్యయ్యో... అహ్హహ్హా... ఐ కాంట్ బిలీవ్ ఇట్

అయ్ బాబోయ్‌గదా ఇది స్వర్గమేమో కదా ఇది

పైసాల్లో పవ ర్ ఇది పన్నీటి షెవర్ ఇది

కాసు ముందు గాలైనా కండిషెన్‌లో ఉంటుంది

పైకంతో ప్రపంచమంతా పడకగదికి వస్తుంది

మబ్బులతో పరుపును కుట్టి

పాలనురుగు దుప్పటి చుట్టి

పరిచి ఉంచిన పానుపు చూస్తే

మేలుకోవా కలలన్నీ...

తందర్‌తర్‌దా తందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దా

తందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దాతందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దా


చిత్రం : క్షణ క్షణం (1991)

రచన : సిరివెన్నెల

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : బాలు, శ్రీదేవి, రిక్కి

No comments:

Post a Comment