Tuesday, April 5, 2011

Konchem istam konchem kastam (2009) - 2

పాట - 1
పల్లవి :

ఆనందమా ఆరటమా ఆలోచనా ఏవిఁటో

పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి

దాహానిదా స్నేహనిదా ఈ సూచన ఏవిఁటో

తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి

ఓ... పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా

స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా

ఓ... కంటికే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా

నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున

చరణం :

ఆ... ఓ... ఓ...

ఎద సడిలో చిలిపి లయ తమ వలనే పెరిగెనయా

కనుక నువ్వే తెలుపవయా

ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ ప్రియా ప్రియా

ఒక క్షణము తోచనీవుగా... కాస్త మరుపైన రావుగా

ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా

ఓ... నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా

ఓ... ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా

ఓ... అందుకే ఇంతగా కొలువైయున్నా నీలోనా

కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించినా

ఆనందమా ఆరటమా ఆలోచనా ఏవిఁటో

పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి

దాహానిదా స్నేహనిదా ఈ సూచన ఏవిఁటో

తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి

ఓ... పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా

ఓ... చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన

ఓ... ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా

కళ్ళల్లో పెట్టుకో ఎదురగ నిలవనా ఎటుతిరిగినా

ఏకాంతమే నీ సొంతమై పాలించుకో ప్రణయమా

కౌగిలే కోటలా ఏలుకో బంధమా


చిత్రం : కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)

రచన : సిరివెన్నెల

సంగీతం : శంకర్-ఎహసాన్-లోయ్

గానం : శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్

----

పాట - 2

పల్లవి :

ఎగిరే... ఎగిరే ఎగిరే... ఎగిరే

చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో

పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో

ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని త్రోవలో

ఫ్లై హై ఇన్ ద స్కై...

ఎగిరే... ఎగిరే పెకైగిరే

కలలే... అలలై పెకైగిరే

పలుకే... స్వరమై పెకైగిరే

ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా

చరణం : 1

మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇపుడే

ఎపుడూ చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఇచటే

ఓ.. ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం

ఈ క్షణమే జీవితం తెలిసింది ఈ క్షణం

మౌనం కరిగెనే మాటలు సూర్యుడి ఎండలో

స్నేహం దొరికెనే మబ్బుల చంద్రుడి నీడలో

ప్రాణం పొంగెనే మెరుపుల తారల నింగిలో

ఫ్లై హై ఇన్ ద స్కై...

ఎగిరే... ఎగిరే పెకైగిరే

కలలే... అలలై పెకైగిరే

పలుకే... స్వరమై పెకైగిరే

ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా

చరణం : 2

తెలుపు నలుపే కాదురా పలురంగులు ఇలా సిద్ధం

మదిలో రంగులు అద్దరా మన కథలకు అదే అర్థం

ఓ... సరిపోదోయ్ బ్రతకడం నేర్చేయ్ జీవించడం

గమనం గమనించడం పయనములో అవసరం

చేసెయ్ సంతకం నడిచే దారపు నుదుటిపై

రాసెయ్ స్వాగతం రేపటి కాలపు పెదవిపై

పంచెయ్ స్నేహితం కాలం చదివే కవితవై

ఫ్లై హై ఇన్ ద స్కై...

ఎగిరే... ఎగిరే పెకైగిరే

కలలే... అలలై పెకైగిరే

పలుకే... స్వరమై పెకైగిరే

ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా


చిత్రం : కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)

రచన : చంద్రబోస్

సంగీతం : శంకర్-ఎహసాన్-లోయ్

గానం : క్లింటన్ సెరెజొ, హేమచంద్ర, రామణ్ మహదేవన్, శిల్పారావ్


No comments:

Post a Comment