Monday, April 4, 2011

Kalyani (1979) - 1

పాట - 1
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను

మధుర భారతి పద సన్నిధిలో

మధుర భారతి పద సన్నిధిలో

ఒదిగే తొలి పువ్వును నేను

ఒదిగే తొలి పువ్వును నేను

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను

చరణం : 1

ఏ ఫలమాశించి మత్తకోకిల ఎలుగెత్తి పాడును

ఏ ఫలమాశించి మత్తకోకిల ఎలుగెత్తి పాడును

ఏ వెల ఆశించి పూసే పవ్వు తావి విరజిమ్మును

ఏ వెల ఆశించి పూసే పవ్వు తావి విరజిమ్మును

అవధిలేని ప్రతి అనుభూతికీ... అవధిలేని ప్రతి అనుభూతికీ

ఆత్మానందమే పరమార్థం

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను

చరణం : 2

ఏ సిరి కోరి పోతన్న భాగవత సుధలు చిలికించెను

ఏ సిరి కోరి పోతన్న భాగవత సుధలు చిలికించెను

ఏ నిధి కోరి త్యాగయ్య రాగ జలనిధులు పొంగించెను

ఏ నిధి కోరి త్యాగయ్య రాగ జలనిధులు పొంగించెను

రమణీయ కళావిష్కృతికీ... రమణీయ కళావిష్కృతికీ

రసానందమే పరమార్థం

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను

మధుర భారతి పద సన్నిధిలో

మధుర భారతి పద సన్నిధిలో

ఒదిగే తొలి పువ్వును నేను

ఒదిగే తొలి పువ్వును నేను

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను


చిత్రం : కళ్యాణి (1979)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : రమేష్‌నాయుడు

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment