Showing posts with label cherry. Show all posts
Showing posts with label cherry. Show all posts

Saturday, March 5, 2011

Alluri sitharamaraju (1974) - 2

పాట - 1

పల్లవి :

ఓహో... హో... ఓహోహో... ఓ... ఓ....

తెలుగువీర లేవరా... ఆ... దీక్షబూని సాగరా.... ఆ...

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

చరణం : 1

దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ...

నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా... ఆ...

దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ...

నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా... ఆ...

నిదురవద్దు... బెదరవద్దు...నిదురవద్దు... బెదరవద్దు...

నింగి నీకు హద్దురా... నింగి నీకు హద్దురా...

చరణం : 2

ఓ... ఎవడువాడు ఎచటివాడు ఎవడువాడు ఎచటివాడు

ఇటు వచ్చిన తెల్లవాడు... ఇటు వచ్చిన తెల్లవాడు

కండబలం కొండఫలం

కబళించే దుండగీడు... కబళించే దుండగీడు

మానధనం ప్రాణధనం

దోచుకునే దొంగవాడు... దోచుకునే దొంగవాడు

ఎవడువాడు ఎచటివాడు

ఇటు వచ్చిన తెల్లవాడు

తగిన శాస్తి చెయ్యరా... తగిన శాస్తి చెయ్యరా

తరిమి తరిమి కొట్టరా... తరిమి తరిమి కొట్టరా

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

చరణం : 3

ఈ దేశం ఈ రాజ్యం... ఈ దేశం ఈ రాజ్యం

నాదే అని చాటించి... నాదే అని చాటించి

ప్రతిమనిషి తొడలుగొట్టి

శృంఖలాలు పగులగొట్టి... శృంఖలాలు పగులగొట్టి

చురకత్తులు పదునుబట్టి

తుది సమరం మొదలుబెట్టి... తుది సమరం మొదలుబెట్టి

సింహాలై గర్జించాలి... సింహాలై గర్జించాలి

సంహారం సాగించాలి... సంహారం సాగించాలి

వందేమాతరం... వందేమాతరం...

వందేమాతరం... వందేమాతరం...

ఓ... ఓ... స్వాతంత్య్రవీరుడా! స్వరాజ్యభానుడా!

అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా!

స్వాతంత్య్రవీరుడా! స్వరాజ్యభానుడా!

అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా!

అందుకో మా పూజలందుకో రాజా

అందుకో మా పూజలందుకో రాజా

అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా!

ఓ... తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా!

మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా!

తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా!

మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా!

త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం

త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం

నిశ్చయముగ... నిర్భయముగ... నీ వెంటనె నడుస్తాం...

నిశ్చయముగ... నిర్భయముగ... నీ వెంటనె నడుస్తాం...

నీ వెంటనె నడుస్తాం...


చిత్రం : అల్లూరి సీతారామరాజు (1974)

రచన : శ్రీశ్రీ

సంగీతం : పి.ఆదినారాయణరావు

గానం : ఘంటసాల, రామకృష్ణ, బృందం

----

పాట - 2

పల్లవి :

వస్తాడు నా రాజు ఈ రోజు

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నల కెరటాలపైన

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నల కెరటాలపైన

తేలి వస్తాడు నా రోజు ఈ రోజు

చరణం : 1

వేల తారకల నయునాలతో నీలాకాశం తిలకించేను

వేల తారకల నయునాలతో నీలాకాశం తిలకించేను

అతని చల్లని అడుగుల సవ్వడి... వీచే గాలి వినిపించేను

అతని పావన పాద ధూళికై అవని... అణువణువు కలవరించేను

అతని రాకకై అంతరంగమే... పాలసంద్రమై పరవశించేను

పాలసంద్రమై పరవశించేను...

వస్తాడు నా రాజు ఈ రోజు

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

చరణం : 2

వెన్నెలలెంతగా విరిసిన గాని... చంద్రుణ్ణి విడిపోలేవు

కెరటాలెంతగా పొంగినగాని... కడలిని విడిపోలేవు

కలసిన ఆత్మల అనుబంధాలు... ఏ జన్మకూ విడిపోలేవులే

తనువులు వేరైనా దారులు వేరైనా

తనువులు వేరైనా దారులు వేరైనా

ఆ బంధాలే నిలిచేనులే... ఆ బంధాలే నిలిచేనులే

వస్తాడు నా రాజు ఈ రోజు

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నల కెరటాలపైన

వస్తాడు నా రాజు ఈ రోజు


చిత్రం : అల్లూరి సీతారామరాజు(1974)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : పి.ఆదినారాయణరావు

గానం : పి.సుశీల

Aggipidugu (1964) - 1

పాట - 1

పల్లవి :

ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది

ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది

ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది

ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది

హఁ.... ఏమో ఏమో ఇది.........

చరణం : 1

కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి

కురులలో ముంగురులలో నా కోరికలూగినివి

అహహా... అహా... ఆ ఆ...

వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది

చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది

గిలిగింతగ తోచినది...

ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది

ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది

చరణం : 2

ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు

అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు

అహహా... ఓహో... అహా... నవ్వుతో...

ముసి నవ్వుతో హోయ్... నను దోచివేయకు

మాటతో సయ్యాటతో నను మంత్రించి వేయకు..

మంత్రించి వేయకు...

ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది

ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది


చిత్రం : అగ్గిపిడుగు (1964)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : రాజన్ - నాగేంద్ర

గానం : ఘంటసాల, ఎస్.జానకి

Friday, March 4, 2011

Adithya 369 (1991) - 2

పాట - 1

పల్లవి :

నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

కన్నులలో సరసపు వెన్నెలలే

సన్నలలో గుసగుస తెమ్మెరలే

మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

చరణం : 1

మోమటు దోచి మురిపెము పెంచే లాహిరిలో అహహా హహా

మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో

చెలి ఒంపులలో హంపికలా ఊగే ఉయ్యాల

చెలి పయ్యదలో తుంగ అలా పొంగే ఈ వేళ

మరి అందుకు విరి పానుపు సవరించవేమిరా

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

కన్నులలో సరసపు వెన్నెలలే

సన్నలలో గుసగుస తెమ్మెరలే

మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

నెరజాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

చరణం : 2

చీకటి కోపం చెలిమికి లాభం... కౌగిలలో

వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో

చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ

తొలి సోయగమే ఓ పగము ఇవ్వాలీవేళ

పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

కన్నులలో సరసపు వెన్నెలలే

సన్నలలో గుసగుస తెమ్మెరలే

మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

జాణవులే అహ్హహ్హా... వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో


చిత్రం : ఆదిత్య 369 (1992)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : జిక్కి, బాలు, శైలజ

----

పాట - 2

పల్లవి :

రాసలీలవేళ రాయబారమేల

మాటే మౌనమై మాయజేయనేలా

రాసలీలవేళ రాయబారమేల

చరణం : 1

కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా

తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల

మోజులన్నీ పాడగా జాజిపూల జావళి

కందెనేమో కౌగిట అందమైన జాబిలి

తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము

మేని వీణలోన పలికే సోయగాల రాగము

నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమాని

రాసలీలవేళ రాయబారమేల

మాటే మౌనమై మాయజేయనేలా

చరణం : 2

మాయజేసి దాయకు సోయగాల మల్లెలు

మోయలేని తీయని హాయి పూల జల్లులు

చేరదీసి పెంచకు భారమైన యవ్వనం

దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం

చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా

చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా

చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువ నీదు

రాసలీలవేళ రాయబారమేల

మాటే మౌనమై మాయజేయనేలా


చిత్రం : ఆదిత్య 369 (1991)

రచన : వెన్నెలకంటి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

Adavi ramudu (1977) - 1

పాట - 1

సాకీ :

మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ

పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ

పల్లవి :

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారుమహాపురుషులౌతారు

తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చరణం : 1

అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి

అతిభయంకరుడు యమకింకరుడు

అడవి జంతులపాలిటి అడుగో అతడే వాల్మీకి

పాలపిట్టల జంట వలపు తేనెల పంట

పండించుకుని పరవశించి పోయేవేళ

ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు

ఒక పక్షిని నేల కూల్చాడు

జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ

తన కంటిలో పొంగ మనసు కరగంగ

ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే

కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా

మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు

నవరసభరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం

ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు

అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు

అందుకే... కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు

తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చరణం : 2

ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం

తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం

కులం తక్కువ ని విద్యనేర్పని గురువు బొమ్మగా మిగిలాడు

బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు

హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలివచ్చి

పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు

ఎదుట నిలిచిన గురుని పదమంటి

ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు

బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు

వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు

ఎరుకలవాడు అయితేనేమి గురికల వాడే మొనగాడు

వేలునిచ్చి తన విల్లును విడిచి

వేలుపుగా ఇల వెలిగాడు

అందుకే... కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు

తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు

చరణం : 3

శబరీ... ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి

ఆశ కరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది

వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడు

కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి

పదముల ఒరిగినది శబరి

ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి

కోరికోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించె

ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగ భావించిన

రఘురాముడెంతటి ధన్యుడో

ఆ శబరిదెంతటి పుణ్యమో

ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి

జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీ నాటికీ

అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు

నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు

అందుకే... కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు

తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు


చిత్రం : అడవిరాముడు (1977)

రచన : వేటూరి

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఎస్.పి.బాలు, బృందం

Abhinandana (1988) - 6

పాట - 1

పల్లవి :

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

కథైనా కలైనా కనులలో చూడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

చరణం : 1

కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము

కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము

గువ్వా గువ్వ కౌగిట్లో గూడు చేసుకున్నాము

అదే స్నేహము అదే మోహము

అదే స్నేహము అదే మోహము

ఆది అంతము ఏదీ లేని గానము

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

కథైనా కలైనా కనులలో చూడనా

చరణం : 2

నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు

నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు

కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు

అదే బాసగా అదే ఆశగా

అదే బాసగా అదే ఆశగా

ఎన్నినాళ్ళు ఈ నిన్నపాటే పాడను

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

కథైనా కలైనా కనులలో చూడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 2

పల్లవి :

మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

మంచుకురిసే వేళలో....

చరణం : 1

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో

జలకమాడి పులకరించే సంబరంలో

జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో

జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో

ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో

మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

మంచుకురిసే వేళలో....

చరణం : 2

మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో

మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో

మన్మథునితో జన్మవైరం చాటినపుడో

ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో

ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో

మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో

మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో

మంచుకురిసే వేళలో...


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

---

పాట - 3

పల్లవి :

ఎదుటా నీవే ఎదలోన నీవే

ఎదుటా నీవే ఎదలోన నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

ఎదుటా నీవే ఎదలోన నీవే

చరణం : 1

మరుపే తెలియని నా హృదయం

తెలిసి వలచుట తొలి నేరం... అందుకే ఈ గాయం

మరుపే తెలియని నా హృదయం

తెలిసి వలచుట తొలి నేరం... అందుకే ఈ గాయం

గాయాన్నైనా మాననీవు... హృదయాన్నైనా వీడిపోవు

కాలం నాకు సాయం రాదు... మరణం నన్ను చేరనీదు

పిచ్చివాణ్ణి కానీదు... ఆహాహ... ఓహొహో...

ఎదుటా నీవే ఎదలోన నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

ఎదుటా నీవే ఎదలోన నీవే

చరణం : 2

కలలకు భయపడి పోయాను

నిదురకు దూరం అయ్యాను... వేదన పడ్డాను

కలలకు భయపడి పోయాను

నిదురకు దూరం అయ్యాను... వేదన పడ్డాను

స్వప్నాలైతే క్షణికాలేగా... సత్యాలన్నీ నరకాలేగా

స్వప్నం సత్యమైతే వింత... సత్యం స్వప్నమయ్యేదుందా

ప్రేమకింత బలముందా...! ఆహాహ... ఓహొహో...

ఎదుటా నీవే ఎదలోన నీవే

ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 4

పల్లవి :

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చేసినాను ప్రేమక్షీరసాగర మథనం

మింగినాను హలాహలం...

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చరణం : 1

పేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము

ఎన్నాళ్ళని ఈ ఎదలో ముళ్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు

నాలోని నీ రూపము నా జీవనాధారము

అది ఆరాలి పోవాలి ప్రాణము

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చరణం : 2

నే నోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము

ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటినే మరిచేపోయి

మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము

అనుడాగాలి ఈ మూగ గానము

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చేసినాను ప్రేమక్షీరసాగర మథనం

మింగినాను హలాహలం...

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 5

పల్లవి :

లాలలాలలా... లాలాలాలలా...

ప్రేమలేదని ప్రేమించరాదని... ప్రేమలేదని ప్రేమించరాదని

సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని

ఓ... ప్రియా... జోహారులు...

ప్రేమలేదని ప్రేమించరాదని

సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని

ఓ... ప్రియా... జోహారులు... లాలలాలలా... లాలాలాలలా...

చరణం : 1

మనసు మాసిపోతే మనిషే కాదని

కటికరాయికైనా కన్నీరుందని

వలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదని

గడియపడిన మనసు తలుపుతట్టి చెప్పని

ముసురుగప్పి మూగవోయి నీవుంటివి

ముసురుగప్పి మూగవోయి నీవుంటివి

మోడుబారి నీడతోడు లేకుంటినీ

ప్రేమలేదని... లలలాలలాలలా

చరణం : 2

గురుతు చెరిపివేసి జీవించాలని

చెరప లేకపోతే మరణించాలని

తెలిసికూడ చేయలేని వెర్రివాడిని

గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని

ముక్కలలో లెక్కలేని రూపాలలో

ముక్కలలో లెక్కలేని రూపాలలో

మరల మరల నిన్ను చూచి రోదించనీ

ప్రేమలేదని ప్రేమించరాదని

ప్రేమలేదని ప్రేమించరాదని

సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని

ఓ... ప్రియా... జోహారులు...


చిత్రం : ఆభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 6

పల్లవి :

రంగులలో కలవో ఎద పొంగులలో కళవో

రంగులలో కలవో ఎద పొంగులలో కళవో

నవ శిల్పానివో రతి రూపానివో

తొలి ఊహల ఊయలవో

రంగులలో కలవో ఎద పొంగులలో కళవో

చరణం : 1

కాశ్మీరనందన సుందరివో... కాశ్మీరనందన సుందరివో

కైలాసవుందిర లాస్యానివో

ఆమని పూచే యామినివో

కాశ్మీరనందన సుందరివో

మరుని బాణమో మధుమాస గానమో

నవపరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై ఎద పొంగులలో కళనై

నవ శిల్పాంగినై రతి రూపాంగినై

నీ ఊహల ఊగించనా

రంగులలో కళనై...

చరణం : 2

ముంతాజు అందాల అద్దానివో

ముంతాజు అందాల అద్దానివో

షాజాను అనురాగ సౌధానివో

లైలా కన్నుల ప్రేయసివో... లైలా కన్నుల ప్రేయసివో

ప్రణయదీపమో నా విరహతాపమో

నా చిత్రకళా చిత్ర చైత్రరథమో

రంగులలో కలనై ఎద పొంగులలో కళనై

నవ శిల్పాంగినై రతి రూపాంగినై

నీ ఊహల ఊగించనా

రంగులలో కలనై ఎద పొంగులలో కళనై


చిత్రం : అభినందన (1988)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

7/g bridavana colony (2004) - 4

పాట - 1

పల్లవి :

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా

నీకై నేను బ్రతికి ఉంటిని ఓ...

నీలో నన్ను చూసుకొంటిని

తెరిచి చూసి చదువు వేళ

కాలి పోయే లేఖ రాశా

నీకై నేను బ్రతికి ఉంటిని ఓ...

నీలో నన్ను చూసుకొంటిని

చరణం : 1

కొలువు తీరు తరువుల నీడ

చెప్పుకొనును మన కథనిపుడు

రాలిపోయిన పూల గంధమా

రాక తెలుపు మువ్వల సడిని

తలచుకొనును దారులు ఎపుడు

పగిలిపోయిన గాజుల అందమా

అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత

ఒడిలొ వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు

తొలి స్వప్నం కానులే ప్రియతమా

కనులూ తెరువుమా

చరణం : 2

మధురమైన మాటలు ఎన్నో

క లసిపోవు నీ పలుకులలో

జగము కరుగు రూపే కరుగునా

చెరిగి పోని చూపులు అన్నీ

రేయి పగలు నిలుచును నీలో

నీదు చూపు నన్ను మరచునా

వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు

కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా

ఒకసారి కాదురా ప్రియతమా ఎపుడూ పిలిచినా

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా

నీకై నేను బ్రతికి ఉంటిని ఓ...

నీలో నన్ను చూసుకొంటిని


చిత్రం : 7/G బృందావన కాలని (2004)

రచన : ఎ.ఎమ్.రత్నం

సంగీతం : యువన్‌శంకర్‌రాజా

గానం : శ్రేయా ఘోషల్

----

పాట - 2

పల్లవి :

తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా

నీకై నేను బ్రతికే ఉంటిని... ఓ...

నీలో నన్ను చూసుకొంటిని

తెరిచి చూసి చదువు వేళ

కాలిపోయే లేఖ బాల

నీకై నేను బ్రతికే ఉంటిని... ఓ...

నీలో నన్ను చూసుకొంటిని

చరణం : 1

కొలువు తీరు తరువుల నీడ

నిన్ను అడిగే ఏమని తెలుప

రాలిపోయిన పూల మౌనమా

రాక తెలుపు మువ్వల సడిని

దారులడిగే ఏమని తెలుప

పగిలిపోయిన గాజులు పలుకునా

అరచేత వేడిని రేపే చెలియ చేతులేవి

ఒడిన వాలి కథలను చెప్ప సఖియ నేడు ఏది

తొలి స్వప్నం ముగియక మునుపే నిదురే చెదిరెలే

తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా

నీకై నేను బ్రతికే ఉంటిని... ఓ...

నీలో నన్ను చూసుకొంటిని

చరణం : 2

మధురమైన మాటలు ఎన్నో

మారుమోగే చెవిలో నిత్యం

కట్టె కాలు మాటే కాలునా

చెరిగిపోని చూపులు నన్ను

ప్రశ్నలడిగే రేయి పగలు

ప్రాణం పోవు రూపం పోవునా

వెంట వచ్చు నీడ కూడ మంట కలిసిపోవు

కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేను

ఒకసారి కనిపిస్తావని బ్రతికే ఉంటి నే


చిత్రం : 7/G బృందావన కాలని (2004)

రచన : ఎ.ఎమ్.రత్నం

సంగీతం : యువన్‌శంకర్‌రాజా

గానం : కె.కె.

----

పాట - 3

పల్లవి :

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా

చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా

ఇది చేరువ కోరే తరుణం

ఇరు ఎదలలో మెల్లని చలనం

ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం

ఇది కత్తిన నడిచే పరువం నిత్య కలలతో తమ తమ రూపం

వెళ్లి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము

లోకంలో తీయని భాష హృదయంలో పలికే భాష

మెలమెల్లగా వినిపించే ఘోష...

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా

చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా

చరణం : 1

తడి కాని కాళ్ళతోటి కడలికేది సంబంధం

నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబంధం

ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం

తెరవలేని మనస్సుకేలా కలలుగనే ఆరాటం

ఒంటరిగా పాదాలు ఏమి కోరి సాగినవో

జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో

తల్లైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవులే

ఎగిరొచ్చి కొన్ని ఆశలు దూకితే ఆ పూట ఎవరికి సాధ్యములే... ఆ...

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా

చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా

చరణం : 2

ఏవైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గ్గెనులే

ఏకాంతం పూసుకొని సంధ్యవేళ పిలిచెనులే

తెల్లవారుజాములన్నీ నిద్రలేక తెలవారే

కనులుమూసి తనలో తానే మాట్లాడతోచెనులే

నడిచేటి దారిలో నీ పేరు కనిపించా

గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించే

అపుడపుడు చిరుకోపములాగ కరిగెను ఎందుకు మంచులాగ

భూకంపం అది తట్టుకోగలమో మది కంపం అది తట్టుకోదే... ఆ...

కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా

చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా


చిత్రం : 7/G బృందావన కాలని (2004)

రచన : ఎ.ఎమ్.రత్నం

సంగీతం : యువన్‌శంకర్‌రాజా

గానం : హరీష్ రాఘవేంద్ర, మధుమిత, ఉస్తాద్ సుల్తాన్‌ఖాన్

----

పాట - 4

పల్లవి :

కన్నుల బాసలు తెలియవులే

కన్నెల మనసులు ఎరుగములే

ఒకవైపు చూపి మరువైపు దాచగా

అద్దాల మససు కాదులే

చేతులు సంద్రాన్ని మూయలేవులే

ఇది అద్దాల మససు కాదులే

చేతులు సంద్రాన్ని మూయలేవులే

గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే

దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే

ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే

అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే

హే... కన్నుల బాసలు తెలియవులే

కన్నెల మనసులు ఎరుగములే

ఒకవైపు చూపి మరువైపు దాచగా

అద్దాల మససు కాదులే

చేతులు సంద్రాన్ని మూయలేవులే

చరణం : 1

అడవిలో కాచే వెన్నెల అనుభవించెదెవ్వరులే

కన్నులా అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే

దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే

మెరుపులా వెలుగును పట్టగ మిణుగురు పురుగుకి తెలియదులే

కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట

అల కడలి దాటగనే నురగలిక ఒడ్డుకు సొంతమట

కన్నుల బాసలు తెలియవులే

కన్నెల మనసులు ఎరుగములే

ఒకవైపు చూపి మరువైపు దాచగా

అద్దాల మససు కాదులే

చేతులు సంద్రాన్ని మూయలేవులే

చరణం : 2

లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే

ఒక పరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే

మంచు బిందువొచ్చి ఢీకొనగా ఈ ముల్లె ముక్కలు అయిపోయెలే

భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్ర్తీ ఆయలే

ఉప్పొనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే

నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలు రెండు కలసివచ్చులే

ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే

అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే

ఏ... కన్నుల బాసలు తెలియవులే

కన్నెల మనసులు ఎరుగములే

ఒకవైపు చూపి మరువైపు దాచగా

అద్దాల మససు కాదులే

చేతులు సంద్రాన్ని మూయలేవులే

గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే

దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే


చిత్రం : 7/G బృందావన కాలని (2004)

రచన : శివగణేశ్, ఎ.ఎమ్.రత్నం

సంగీతం : యువన్‌శంకర్‌రాజా

గానం : హరీష్ రాఘవేంద్ర