Thursday, June 2, 2011

Mr.perfect (2011) - 4

పాట - 1
పల్లవి :

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది

నీ వైపే మళ్లింది మనసు

చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది

సతమతమై పోతుంది వయసు

చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో

గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే

చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో

గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైన ట్టు

నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు

ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది

నీ వైపే మళ్లింది మనసు

చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది

సతమతమై పోతుంది వయసు

చరణం : 1

గొడవలతో మొదలై తగువులతో బిగువై

పెరిగిన పరిచయమే నీది నాది

తలపులు వేరైనా కలవని తీరైనా

బలపడిపోతుందే ఉండే కొద్దీ

లోయలోకి పడిపోతున్నట్టు

ఆకాశం పైకి వెళుతున్నట్టు

తారలన్నీ తారస పడినట్టు

అనిపిస్తుందే నాకు ఏమైనట్టు

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైన ట్టు

నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు

ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

చరణం : 2

నీపై కోపాన్ని ఎందరి ముందైనా

బెదురే లేకుండా తెలిపే నేను

నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా

తెలపాలనుకుంటే తడబడుతున్నాను

నాకు నేనే దూరం అవుతున్నా

నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే

నన్ను నేనే చేరాలనుకున్నా

నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైన ట్టు

నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు

ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : శ్రేయా ఘోషల్

----

పాట - 2

పల్లవి :

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు క ళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక

రై రై రై రైడ్ చేసెయ్ రాకెట్‌లా మనసునీ

సై సై సై సైడ్ చేసెయ్ సిగ్నల్స్‌తో ఏం పనీ

ఇక హైవేలైనా వన్‌వేలైనా

కదలదే బండి తేరే బినా

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు క ళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక

చరణం : 1

పార్టీలా ఉంది నీతోటి ప్రతిక్షణం

ఎందుకంటే చెప్పలేను కారణం

టేస్టీగా ఉంది నువు చెప్పే ప్రతి పదం

బాగుందబ్బా మాటల్లోన ముంచడం

హే రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్లిస్తుందా జాణా

నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా

కార్టూన్ చానెల్‌లోనైనా ఈ ఫన్నుందాలోలోనా

నీతో పాటు గడిపేస్తుంటే ైటె మే తెలిసేనా

ఇక సాల్సాలైనా సాంబాలైనా కదలదే ఒళ్లు తేరే బినా

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు క ళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక

చరణం : 2

ఆన్‌లైన్‌లో నువ్వు హాయ్ అంటే నా మది

క్లౌడ్ నైన్‌లోకి నన్ను తోస్తది

ఆఫ్‌లైన్‌లో నువ్వు ఉన్నావంటే మది

కోల్ మైన్‌లోకి కూరేస్తది

ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్‌లా కనిపిస్తుంది జాణా

నాతో పాటు ఈ ఫీలింగు నీకు కొత్తేనా

ఏ రోజైనా వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైనా

నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా

ఇక డేటింగైనా ఫైటింగైనా గడవడే రోజు తేరే బినా

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : సాగర్, మేఘ

----

పాట - 3

అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను... నేను

నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోను... కోను

ఎందులోను నీకు నేను తీసిపోను

నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను

అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను

పచ్చి పైరగాలి పీల్చి పెరిగినాను

ఏరికోరి గిల్లికజ్జా పెట్టుకోను

నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను

హోయ్ హోయ్ హోయ్ హే...

సూటు బూటు స్టైలు సుందరా

లేనిపోని డాబు మానరా

ఈ ఊరిలో పైచేయి నాదిరా

నా గొప్ప నువ్వు ఒప్పుకో తప్పు లేదురా

రేవులోని తాటిచెట్టులా నీ ఎక్కువేమిటో

ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో ఓయ్


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)

రచన : రామజోగయ్యశాస్ర్తి

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : గోపిక పూర్ణిమ

----

పాట - 4

హే... నింగి జారిపడ్డ చందమామ ముక్క

లేనిపోని టెక్కు నీకు జన్మ హక్కా

చాల్లే చిందులాట కోతి పిల్లా

హే... అణిగిమణిగి ఉండలేవా ఆడపిల్లలా

హే... చిన్న పల్లెటూరి బావిలోన కప్ప

నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప

నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా

హే... నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా

మీసమున్న కురవ్రాణ్నిలే మీదికొస్తే ఊరుకోనులే... ఏ..

కొండతోటి పందెమేయకే

నొప్పులు బొప్పులు తప్పవే మరి

హే... పంతం మానుకోవే పాలకోవా

పచ్చిమిర్చితోటి పందెమేస్తే ఓడిపోవా... హే హే...


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)

రచన : రామజోగయ్యశాస్ర్తి

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : మల్లికార్జున్

Tuesday, May 31, 2011

Matrudevobhava (1993) - 2

పాట - 1

పల్లవి :

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

మాతృదేవోభవ... పితృదేవోభవ... ఆచార్యదేవోభవ...

చరణం : 1

ఏడుకొండలకైనా బండతానొక్కటే

ఏడు జన్మల తీపి ఈ బంధమే

ఏడుకొండలకైనా బండతానొక్కటే

ఏడు జన్మల తీపి ఈ బంధమే

నీ కంటిలో నలక లో వెలుగు

నే కనక నేను నేననుకుంటే ఎద చీకటే

హరీ... హరీ... హరీ...

రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏనాటికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి

చరణం : 2

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే

నిప్పు నిప్పుగమారె నాగుండెలో... ఆ...

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే

నిప్పు నిప్పుగమారె నాగుండెలో...

ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు

పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు

హరీ... హరీ... హరీ...

రెప్పనై ఉన్నాను మీ కంటికి

పాపనై వస్తాను మీ ఇంటికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి

గాలినై పోయాను గగనానికి...


చిత్రం : మాతృదేవోభవ (1993)

రచన : వేటూరి

సంగీతం : ఎంఎం.కీరవాణి

గానం : చిత్ర

----

పాట - 2

పల్లవి:

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటమాలి నీ తోడు లేడులే

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడోచీకటాయెలే

నీకిది తెలవారని రేయమ్మా

కలికీ మా చిలక పాడకు నిన్నటి నీ రాగం

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటమాలి నీ తోడు లేడులే

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడో చీకటాయెలే

చరణం : 1

చెదిరింది నీ గూడు గాలిగా చిలకగోరింకమ్మ గాధగా

చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా ఆ....

తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగ

సిందూరవర్ణాలు తెల్లారి చల్లారి పోగా

తిరిగే భూమాత వు నీవై వేకువలో వెన్నెలవై

కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటమాలి నీ తోడు లేడులే

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

చరణం : 2

అనుబంధమంటెనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే

హేమంతరాగాల చేవుంతులే వాడిపోయే ఆ..

తనరంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే

దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పోయే

పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలవై

మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటవూలి నీ తోడు లేడులే

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడో చీకటాయెలే


చిత్రం : మాతృదేవోభవ (1993)

రచన : వేటూరి

సంగీతం, గానం : ఎం.ఎం.కీరవాణి

Master (1997) - 2

పాట - 1
పల్లవి :
తమ్ముడు అరె తమ్ముడు

ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే

నను అడగర చెబుతా డౌటుంటే

నువు బెదరవు కదా నా మాటింటే

అమ్మడు ఓయ్ అమ్మడు నువు మరీ పరాగ్గా ఉంటుంటే

నీకు నిదరే సరిగా రాకుంటే

ఏం జరిగిందో తెలియాలంటే

ఆ రహస్యాన్ని చెబుతా వింటే

మాస్టారూ మాస్టారూ మంచి లెక్చర్ ఇచ్చారు

మాస్టారూ మాస్టారూ లవ్‌లో మీరు మెగాస్టారు

థాంక్యూ... తమ్ముడు అరె తమ్ముడు

ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే

చరణం : 1

వేల వేల భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్లామరొక్కటే లవరు

ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరూ

మూగసైగలైన చాలు వేడి ఊపిరైన చాలు గుర్తుపట్టలేరా ప్రేమికులు

అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు

అమెరికాలో ఇంగ్లిష్ ప్రేమ

ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ

ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ

తమ్ముడు అరె తమ్ముడు

పొట్టివాళ్లు పొట్టవాళ్లు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు

ప్రేమదేశం వెళ్లగానే మానవులుగా మిగులుతారు

తమ్ముడు అరె తమ్ముడు

ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే

నను అడగర చెబుతా డౌటుంటే

నువు బెదరవు కదా నా మాటింటే

చరణం : 2

లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు

అది మహాసముద్రం ఫ్రెండు

సెంచరీల కొద్ది పెద్ద సీరియల్‌గా సాగుతున్న మహా నవలరా ప్యారు

ఆ స్టోరీ కొట్టదు బోరు

కగుడింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు

కాఫీ టీలే తాగని వాళ్లు దేవదాసులు అయిపోతారు

అమ్మడు ఓయ్ అమ్మడు లబ్బుడబ్బు హార్ట్‌బీట్ లవ్వులవ్వు అన్నదంటే

హైక్లాసు లోక్లాసు చూసుకోదు ప్రేమ కేసు

తమ్ముడు అరె తమ్ముడు

ఈ తికమక తెగులే ప్రేమంటే

ఈ తెలియని దిగులే ప్రేమంటే

నను అడగర చెబుతా డౌటుంటే

నువు బెదరవు కదా నా మాటింటే

అమ్మడు ఓయ్ అమ్మడు నువు మరీ పరాగ్గా ఉంటుంటే

నీకు నిదరే సరిగా రాకుంటే

ఏం జరిగిందో తెలియాలంటే

ఆ రహస్యాన్ని చెబుతా వింటే

మాస్టారూ మాస్టారూ మంచి లెక్చర్ ఇచ్చారు

మాస్టారూ మాస్టారూ లవ్‌లో మీరు మెగాస్టారు


చిత్రం : మాస్టర్ (1997)

రచన : సిరివెన్నెల

సంగీతం : దేవా

గానం : చిరంజీవి, బృందం

----

పాట - 2


పల్లవి :

తిలోత్తమా ప్రియ వయ్యారమా

ప్రభాతమా శుభ వసంతమా

నే మోయలేనంటూ హృదయాన్ని అందించా

నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా

ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది

ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది

ఆ... తిలోత్తమా ప్రియ వయ్యారమా...

చరణం : 1

పెదవే ఓ మధుర కవిత చదివే

అడుగే నా గడపనొదిలి కదిలే

ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణీ ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా

ఈ మాయ చేసింది ప్రేమే

ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే

తిలోత్తమాసుఖ వసంతమా

చరణం : 2

కలలే నా ఎదుట నిలిచె నిజమై

వలపే నా ఒడికి దొరికె వరమై

ఏ రాహువైనా ఆషాఢమైనా ఈ బహుబంధాన్ని విడదీయునా

నీ మాటలే వేదమంత్రం

చెలి నువ్వన్నదే నా ప్రపంచం

తిలోత్తమా ప్రియ వయ్యారమా

ప్రభాతమా శుభ వసంతమా

నే మోయలేనంటూ హృదయాన్ని అందించా

నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా

ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది

ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది


చిత్రం : మాస్టర్ (1997)

రచన : చంద్రబోస్

సంగీతం : దేవా

గానం : హరిహరన్, సుజాత


Mass (2004) - 3

పాట - 1

పల్లవి :

నాతో వస్తావా నాతో వస్తావా

నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా

నీతో వస్తాలే నీతో వస్తాలే

నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే

నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా

ఏడడుగులింక నను నడిపిస్తే నీతో వస్తాలే

ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా

హొయ్... గోరి గోరి గోరి గోరి గోలుకొండ ప్యారీ రావె నా సంబరాల సుందరి

హేయ్... చోరి చోరి చోరి చోరి చేయజారకోరి నీదే సోయగాల చోకిరి

చరణం : 1

మదిలో మెదిలే ప్రతి ఆశా నువ్వు

ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు

హృదయం ఎగిసే ప్రతి శ్వాసా నువ్వు

నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు

రేయి పగలు నా కంటిపాపలో నిండినావె నువ్వే

అణువు అణువు నీ తీపి తపనతో తడిసిపోయే కలలే

హేయ్... గింగిరాల బొంగరాల టింగురంగసాని రావే నా జింగిలాల జిగినీ

హే... రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ

నాతో వస్తావా నాతో వస్తావా

నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా

రణం : 2

అరెరే అరె రే తేనూరే పెదవి

మెలికే పడని నను నీలో పొదివి

పడితే నదిలా వరదయ్యే నడుము

పరదా విడనీ నీదయ్యే క్షణము

పరువమెందుకీ పరుగులాటవే పరుపు చేరు వరకూ

పడుచు వయసులో అంచు పైటలే బరువులాయె నాకు

హోయ్... చెంతకింక చేర చేర సిగ్గులెందుకోరి రావే నా బంతిపూల లాహిరి

హోయ్... చెంగులోన దూరి దూరి గింగురెత్తి పోరి కొంగే గొడుగెత్తుకుంది జాంగిరీ

నాతో వస్తావా నాతో వస్తావా

నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా

నీతో వస్తాలే నీతో వస్తాలే

నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే


చిత్రం : మాస్ (2004)

రచన : సాహితి

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : ఉదిత్ నారాయణ్, సుమంగళి

----

పాట - 2

పల్లవి :

బూరెలాంటి బుగ్గ చూడు

కారు మబ్బులాంటి కురులు చూడు

వారెవా! క్యా హెయిర్ స్టైల్ యార్

అన్న... సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ

హేయ్... ఓ... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి

నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి

హో... బూరెబుగ్గ బంగారి.. చేపకళ్ళ చిన్నారి

బుంగమూతి ప్యారి... నంగనాచి నారి... లవ్వు చెయి ఓ సారి

హ్... నిన్ను చూసినాక ఏమైందో పోరి

వింత వింతగుంటోంది ఏమిటో ఈ స్టోరి

నువ్వు కన పడకుంటే తోచదే కుమారి

నువ్వు వస్తే మనసంతా... స రి గ మ ప గ రి

ఓ... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి

నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి

నన్ను ముంచినావే దేవేరి

చరణం : 1

నీ హృదయంలో నాకింత చోటిస్తే

దేవతల్లే చూసుకుంట... నీకు ప్రాణమైనా రాసి ఇస్తా

అలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే

దీవెనల్లే మార్చుకుంట... దాన్ని ప్రేమలాగ స్వీకరిస్తా

నాకోసం పుట్టినావని నా మనసే చెప్పినాదిలే

ఈ బంధం ఎప్పుడొ ఇలా పైవాడు వేసినాడులే

ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే... నీకు నేను ఇష్టమేనని

ఓ... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి

నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి

నన్ను ముంచినావే దేవేరి

వహ్ ఆ హొ వహ్ ఆ హొ కుర్రాడు మంచివాడుగా ఒప్పుకో

వహ్ ఆ హొ వహ్ ఆ హొ ఆరడుగుల అందగాడు ఒప్పుకో

చరణం : 2

ఈ ముద్దుగుమ్మే నా వైఫ్‌గా వస్తే...

బంతిపూల దారి వేస్తా... లేతపాదమింక కందకుండా

ఆ జాబిలమ్మే నా లైఫ్‌లో కొస్తే దిష్టి తీసి హారతిస్తా!

ఏ పాడుకళ్ళు చూడకుండా

నాలాంటి మంచివాడిని... మీరంత చూసి ఉండరే

ఆ మాటే మీరు ఈమేతో ఓసారి చెప్పి చూడరే

ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే... నువ్వు నాకు సొంతమేనని

ఓ... వాలు కళ్ళ వయ్యారి తేనెకళ్ళ సింగారి

నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినావే కావేరి

నన్ను ముంచినావే దేవేరి


చిత్రం : మాస్ (2004)

రచన : భాస్కరభట్ల

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : కార్తీక్

----

పాట - 3

పల్లవి :

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా

హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోటు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా

కొట్టు కొట్టు కొట్టు డోటు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా

హెయ్.. ఎర్ర రంగులోన చూడు - రబ్బా రబ్బా

కుర్ర గుండె జోరు ఉంది - రబ్బారే

పచ్చరండులోన చూడు - రబ్బా రబ్బా

పడుచుకళ్ల గీర ఉంది - రబ్బారే

రంగు ఏదైనగానీ ఊరు వేరైనగానీ రారో మనమంత ఒక్కటే...

హోలి హోలి హోలి రంగుల రంగోలి

హోలి హోలి హోలి రంగుల రంగోలి నింగినేల రంగే వూరాలి

హోలి హోలి హోలి రంగులోన తేలి చెమ్మకేళి జలకాలాడాలి

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా

రణం : 1

హె... కోరమీసపు రోసగాడివే ఓరకంట నన్ను చూడవెందుకు

కొంటె కోణంగి పిల్లవే కాస్తూరుకుంటె కొంపే కొల్లేరు చేస్తవె హాయ్

అన్ని ఊళ్ళకి అందగత్తెని చెంతకొచ్చి పలకరించవెందుకు

అమ్మో సందిస్తె చాలులే అరగంటలోనె మెళ్లో జగడంటలేస్తవే... హే...

నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ నాతో సరసాలు ఆడ రావె రావె

అట్టా కయ్యాల భామ నీతో సయ్యాటలడ నీపై ఆశంటు ఒకటి ఉండాలె

ఇంద్రధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరో...

హోలి హోలి హోలి...

హోలి హోలి హోలి రంగుల రంగోలి చిందులెయ్యి చిందె వెయ్యాలి

హోలి హోలి హోలి రంగులోన తేలి చీకుచింతలన్నీ మరవాలి

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా

రె లచ్చన్నా రంగులన్నీ అయిపోయినాయ్ తొరగా తీసుకురండ్రా

హోయ్... హోయ్.. ఆయిరే హోలి ఆయిరే ఓరబ్బా హోలి

రంగోకి వర్షా లాయిరే తా ధినక్ త ధినక్ త దినక్‌త

తధిమ్ ధినకత్ ధినక్ త ధినక్‌త ధితాంగ్ ధితాంగ్ త... క్యా బాత్ హై

చరణం : 2

కాటుకెట్టిన కళ్లమాటున దాచుకున్న కన్నె ఊసులెందుకు

నీలా నీలాల నింగిలో ఆ గాలి మేడలెన్నో కట్టేయడానికే... హెయ్

పాలబుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసిపడేదెందుకో

బంతి పూబంతి భామనీ ఓ పూల కట్టి బంతూలూగించటానికే... హెయ్

నన్నే పెళ్లాడువాడు తాళే కట్టేటిచోట ఎట్టా ఉంటాడో ఏమో నా జతగాడు

నిన్నే మెచ్చేటివాడు బుగ్గే గిచ్చేటి తోడు రానే వస్తాడు చూడు ఓర్నాయనో

పండే నోములన్నీ పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే... హోయ్

హోలి హోలి హోలి...

హోలి హోలి హోలి రంగుల రంగోలి సంబరాల సరదా చెయ్యూలి

హోలి హోలి హోలి రంగులోన తేలి సందడంతా మనదే కావాలి

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా

హెయ్.. కొట్టు కొట్టు కొట్టు డోటు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు ఉందిరా


చిత్రం : మాస్ (2004)

రచన : సాహితి

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : టిప్పు, ప్రసన్న, బృందం