Thursday, June 2, 2011

Mr.perfect (2011) - 4

పాట - 1
పల్లవి :

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది

నీ వైపే మళ్లింది మనసు

చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది

సతమతమై పోతుంది వయసు

చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో

గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే

చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో

గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైన ట్టు

నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు

ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది

నీ వైపే మళ్లింది మనసు

చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది

సతమతమై పోతుంది వయసు

చరణం : 1

గొడవలతో మొదలై తగువులతో బిగువై

పెరిగిన పరిచయమే నీది నాది

తలపులు వేరైనా కలవని తీరైనా

బలపడిపోతుందే ఉండే కొద్దీ

లోయలోకి పడిపోతున్నట్టు

ఆకాశం పైకి వెళుతున్నట్టు

తారలన్నీ తారస పడినట్టు

అనిపిస్తుందే నాకు ఏమైనట్టు

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైన ట్టు

నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు

ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

చరణం : 2

నీపై కోపాన్ని ఎందరి ముందైనా

బెదురే లేకుండా తెలిపే నేను

నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా

తెలపాలనుకుంటే తడబడుతున్నాను

నాకు నేనే దూరం అవుతున్నా

నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే

నన్ను నేనే చేరాలనుకున్నా

నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైన ట్టు

నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు

ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : శ్రేయా ఘోషల్

----

పాట - 2

పల్లవి :

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు క ళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక

రై రై రై రైడ్ చేసెయ్ రాకెట్‌లా మనసునీ

సై సై సై సైడ్ చేసెయ్ సిగ్నల్స్‌తో ఏం పనీ

ఇక హైవేలైనా వన్‌వేలైనా

కదలదే బండి తేరే బినా

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు క ళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక

చరణం : 1

పార్టీలా ఉంది నీతోటి ప్రతిక్షణం

ఎందుకంటే చెప్పలేను కారణం

టేస్టీగా ఉంది నువు చెప్పే ప్రతి పదం

బాగుందబ్బా మాటల్లోన ముంచడం

హే రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్లిస్తుందా జాణా

నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా

కార్టూన్ చానెల్‌లోనైనా ఈ ఫన్నుందాలోలోనా

నీతో పాటు గడిపేస్తుంటే ైటె మే తెలిసేనా

ఇక సాల్సాలైనా సాంబాలైనా కదలదే ఒళ్లు తేరే బినా

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు క ళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక

చరణం : 2

ఆన్‌లైన్‌లో నువ్వు హాయ్ అంటే నా మది

క్లౌడ్ నైన్‌లోకి నన్ను తోస్తది

ఆఫ్‌లైన్‌లో నువ్వు ఉన్నావంటే మది

కోల్ మైన్‌లోకి కూరేస్తది

ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్‌లా కనిపిస్తుంది జాణా

నాతో పాటు ఈ ఫీలింగు నీకు కొత్తేనా

ఏ రోజైనా వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైనా

నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా

ఇక డేటింగైనా ఫైటింగైనా గడవడే రోజు తేరే బినా

ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన మోగుతుంది నిన్ను కలిశాక

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : సాగర్, మేఘ

----

పాట - 3

అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను... నేను

నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోను... కోను

ఎందులోను నీకు నేను తీసిపోను

నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను

అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను

పచ్చి పైరగాలి పీల్చి పెరిగినాను

ఏరికోరి గిల్లికజ్జా పెట్టుకోను

నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను

హోయ్ హోయ్ హోయ్ హే...

సూటు బూటు స్టైలు సుందరా

లేనిపోని డాబు మానరా

ఈ ఊరిలో పైచేయి నాదిరా

నా గొప్ప నువ్వు ఒప్పుకో తప్పు లేదురా

రేవులోని తాటిచెట్టులా నీ ఎక్కువేమిటో

ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో ఓయ్


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)

రచన : రామజోగయ్యశాస్ర్తి

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : గోపిక పూర్ణిమ

----

పాట - 4

హే... నింగి జారిపడ్డ చందమామ ముక్క

లేనిపోని టెక్కు నీకు జన్మ హక్కా

చాల్లే చిందులాట కోతి పిల్లా

హే... అణిగిమణిగి ఉండలేవా ఆడపిల్లలా

హే... చిన్న పల్లెటూరి బావిలోన కప్ప

నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప

నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా

హే... నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా

మీసమున్న కురవ్రాణ్నిలే మీదికొస్తే ఊరుకోనులే... ఏ..

కొండతోటి పందెమేయకే

నొప్పులు బొప్పులు తప్పవే మరి

హే... పంతం మానుకోవే పాలకోవా

పచ్చిమిర్చితోటి పందెమేస్తే ఓడిపోవా... హే హే...


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)

రచన : రామజోగయ్యశాస్ర్తి

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : మల్లికార్జున్